బహుజనుల కోసం పని చేస్తే వ్యతిరేకిస్తారా
NEWS Jul 16,2025 07:07 am
బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై సీరియస్ అయ్యారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై చవకబారు విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బాధ్యత కలిగిన పదవులలో ఉన్న వాళ్లు సంయమనం పాటించాలని సూచించారు. తెలంగాణకు బూతులు పరిచయం చేసింది మీ నాయకుడు కేసీఆర్ కాదా అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని వ్యతిరేకించడం సరి కాదన్నారు.