జగదీశ్ రెడ్డీ దమ్ముంటే రాజీనామా చేయ్
NEWS Jul 16,2025 07:02 am
ఎమ్మెల్యే పదవికి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే వేముల వీరేశం. తను సూర్యాపేట నుంచి పోటీ చేసి గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. తను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దొరతో అంటకాగిన నీకు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.