జగదీశ్ రెడ్డికి ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్
NEWS Jul 16,2025 06:58 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో దోచు కోవడమే తప్ప.. సొంత ఊరికి ఏదైనా చేశావా అంటూ నిలదీశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య. తులసి వనంలో గంజాయి మొక్క లాంటి నువ్వా మా గురించి మాట్లాడేదంటూ ఫైర్ అయ్యారు. నువ్వు జెడ్పీటీసీకి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. అత్తెసరు మెజారిటీతో గెలిచిన నీకు తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.