ఉక్రెయిన్ నూతన ప్రధానిగా యూలియా
NEWS Jul 16,2025 06:17 am
ఉక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా యూలియాను నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ. పార్లమెంట్ ఆమోదం పొందిన అనంతరం ఉక్రెయిన్ రెండో మహిళా ప్రధాని కానున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వంలో మొదటి డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు. యుద్ధ సమయంలో అమెరికా, ఐరోపాతో ఆర్థిక సహకారం పెంపొందించడంతో పాటు రక్షణ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో తనకే ప్రయారిటీ ఇచ్చారు.