బాలల అక్రమ రవాణాను నియంత్రించాలి
NEWS Jul 16,2025 06:41 am
బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాలల అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో కనిగిరిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సూచించారు. బాలల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.