మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు
NEWS Jul 15,2025 01:56 pm
మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో అర్ధరాత్రి మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. ముసలమ్మ గుట్ట, దోమెడ్, ST కాలనీ, పాలాయిగూడెం, తిమ్మాపూర్, రాళ్లగుంపు, కేశవాపురం వంటి గొత్తికోయగూడెళ్లలో "మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్" పేరుతో పోస్టర్లు కనిపించాయి. మావోయిస్టు అగ్రనేతలు ఆయుధాలు విడిచి, జనజీవన స్రవంతిలో కలవాలని, శాంతియుత మార్గాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు.