శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తివేత
NEWS Jul 15,2025 10:30 am
భారీ ఎత్తున వరద నీరు చేరుకుంటోంది శ్రీశైలం జలాశయానికి. దీంతో రేడియల్ క్రెస్టు గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి వేశారు. ఇన్ ఫ్లో 65,985 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 95,175, క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.582 టీఎంసీల వద్ద నీరు నిలిచి ఉంది. నీళ్లు సమృద్దిగా ఉండడంతో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది.