తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు
NEWS Jul 13,2025 07:50 pm
నారాయణపేట జిల్లా మరికల్ మండలం బుడ్డగాని తాండా, ఉట్కూర్ మండలం తిమ్మారెడ్డి పల్లి తాండా లో ఆదివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసినట్లు చెప్పారు. దాడుల్లో 11 లీటర్ల సారా, లీటర్ నవగ్రాసం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నాటు సారా తయారు చేస్తున్న బుజ్జమ్మ, శాంతమ్మ, మంగమ్మ, అంతమ్మ లపై కేసులు నమోదు చేశామని చెప్పారు.