కోట శ్రీనివాసరావుకు వెంకయ్య నివాళి
NEWS Jul 13,2025 01:10 pm
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోట శ్రీనివాస రావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబీకులను ఓదార్చారు. కోట మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. నటుడిగా భిన్నమైన పాత్రలు పోషించారని, రాజకీయాలలో అజాత శత్రువుగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఇలాంటి నటుడు మళ్లీ పుట్టడని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.