కోట మృతి బ్రహ్మానందం కంటతడి
NEWS Jul 13,2025 01:01 pm
నటుడు కోట శ్రీనివాసరావు మృతితో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కమెడియన్ బ్రహ్మానందం. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశానని, తనకు ఆయన పెద్దన్న లాంటి వారని, ఇప్పుడు తాను ఎవరితో మాట్లాడాలంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. తన శరీరంలో ఒక భాగం కోల్పోయినట్లు బాధగా ఉందన్నారు. కోట మరణం తీరని విషాదాన్ని మిగిల్చిందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.