కోట మృతి నాకు తీరని లోటు - చిరంజీవి
NEWS Jul 13,2025 12:34 pm
ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. తామిద్దరం ఒకేసారి సినీ రంగంలోకి ఎంటర్ అయ్యామని గుర్తు చేశారు. ప్రాణం ఖరీదులో తను కూడా కెరీర్ ను స్టార్ట్ చేశారని, ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించారని, తామిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన లేరన్న వాస్తవం జీర్ణించుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. అజాత శత్రువుగా పేరు పొందారని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారన్నారు నటులు రవితేజ, మంచు విష్ణు.