కోట మరణం కేసీఆర్ విచారం
NEWS Jul 13,2025 10:07 am
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిల పరుచుకున్నారని పేర్కొన్నారు. ఆయన మృతితో చలన చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్.