కోట మరణం బాధాకరం - దుర్గేష్
NEWS Jul 13,2025 09:58 am
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు వారి గుండెల్లో ప్రత్యేక స్థానం కోట కట్టుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు అని కొనియాడారు. ఆయన మృతితో గొప్ప నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయిందన్నారు. కోట మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా అలరించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.