సోనియా గాంధీకి కవిత పోస్టు కార్డులు
NEWS Jul 13,2025 07:10 am
సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపించారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు.