పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన వీజీఓలకు అభినందన
NEWS Jul 13,2025 07:08 am
ప్రపంచ పోలీసు క్రీడల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించిన టీటీడీలో విధులు నిర్వహిస్తున్న వీజీవోలను అభినందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇటీవలే అమెరికాలో ప్రపంచ పోలీస్ ఆటలు జరిగాయి. ఈ సందర్బంగా మర్యాద పూర్వకంగా చైర్మన్ ను కలిశారు. తాము సాధించిన బంగారు, కాంస్య పతకాలను చైర్మన్ కు చూపించారు. టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా విజయం సాధించిన ఇరువురు భధ్రతాధికారులను సన్మానించారు. వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.