ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
NEWS Jul 13,2025 06:34 am
ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విలన్ గా, కమెడియన్ గా భిన్నమైన పాత్రలు పోషించారు. విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందారు. తన వయసు 83 ఏళ్లు. సినీ కెరీర్ పరంగా కోట శ్రీనివాస రావు 700కి పైగా సినిమాలలో నటించారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు.