రాఘవపేటలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన
NEWS Jul 12,2025 09:05 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ (మం) రాఘవపేటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వమని, అందుకే ప్రజల సౌకర్యార్థం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.