రేపు కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS Jul 12,2025 06:01 pm
కనిగిరి పట్టణంలోని ఫీడర్ 3 లో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఏఈ పవన్ కుమార్ తెలిపారు. చెప్పుల బజార్, గార్లపేట రోడ్డు, దరువు, సాయిబాబా గుడి, ఎన్జీవో కాలనీ, శివనగర్ కాలనీ, సాయి నగర్, ఉంగరం బిల్డింగ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.