మరిపూడిలో పర్యటించిన దామచర్ల సత్య
NEWS Jul 12,2025 03:01 pm
ప్రకాశం జిల్లా మరిపూడిలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పర్యటించారు. గ్రామంలో గడపగడపకు వెళ్లి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు సంక్షేమం గురించి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం హామీలు, సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.