బండి కామెంట్స్‌పై భగ్గుమన్న భూమన
NEWS Jul 12,2025 09:20 am
కేంద్రమంత్రి బండి సంజయ్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పరమత సహనం పాటించమని హిందూ ధర్మమే చెబుతుందని , కానీ మనుషుల మధ్య భేదాలు సృష్టించేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. టీటీడీలో అన్య మతస్తులు ఉన్నారంటూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పక్కనే పాలక మండలి సభ్యుడిని పెట్టుకుని కామెంట్స్ చేయడం సబబు కాదన్నారు.