ఘనంగా చిరుమిల్ల రాకేష్ బర్త్ డే
NEWS Jul 12,2025 04:23 pm
పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమిల్ల రాకేష్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. కేక్ కట్టింగ్, బాణాసంచా టపాసులతో వాతావరణం సందడిగా మారింది. బీఆర్ఎస్ నాయకుడు ఉప్పు శివకుమార్ మాట్లాడుతూ, "డా. చిరుమిల్ల రాకేష్ అన్న సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో జీవితంలో ఎల్లప్పుడూ విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము" అని అన్నారు.