పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు
NEWS Jul 12,2025 09:21 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని... మనం మరింత బలపడటం అని చెప్పారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని... కలిసి ప్రయాణం చేయడమని అన్నారు.