X సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గింపు
NEWS Jul 12,2025 09:39 am
ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ (ట్విట్టర్) సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇండియాలో సబ్‌స్క్రిప్షన్ ధరలను 47 శాతం వరకు తగ్గింపు చేస్తున్నట్లు తెలిపింది. వెబ్ వెర్షన్ లో బేసిక్ నెలకు రూ.244 నుంచి 170కి, ప్రీమియంకు రూ.650 నుంచి 427కి, ప్రీమియం+కి రూ.3,470 నుంచి 2,570కి తగ్గించినట్లు పేర్కొంది. ఇక యాప్ వెర్షన్ లో బేసిక్ నెలకు రూ.244 నుంచి 170కి, ప్రీమియంకు రూ.900 నుంచి 470కి, ప్రీమియం+కి రూ.5,130 నుంచి 3,000కి తగ్గించినట్లు స్పష్టం చేసింది.