బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం
NEWS Jul 12,2025 09:35 am
కాంగ్రెస్ సర్కార్ తీసుకు వచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిందని తెలిపారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైకోర్టు చీవాట్లు పెట్టడంతో హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.