ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీరు విడుదల అవుతుండడంతో జూరాలకు 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టులో 882.9 అడుగుల మేర నీరు నిలిచి ఉంది. ఎగువ నుంచి 1,41,105 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో మూడు గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు.