ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
NEWS Jul 12,2025 09:20 am
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి నారాయణ. సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారని తెలిపారు. వారి డిమాండ్లపై సబ్ కమిటీ పలుమార్లు చర్చించిందన్నారు. కార్మికులకు మేలు చేసేలా మంత్రివర్గ ఉప సంఘం సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్థిక శాఖతో చర్చించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామన్నారు .