చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి
NEWS Jul 12,2025 09:28 am
మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద కామెంట్స్ చేశారు. చెప్పికాదు చెప్పకుండా నరికేయాలన్నారు. చీకట్లో కన్ను కొడితే పని అయి పోవాలన్నారు. అంతా అయిపోయాక పరామర్శలకు వెళ్లాలి.. ఇప్పుడు అరవడం కాదు తప్పు చేసిన వాడు ఎవరైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వేసేయండంటూ పిలుపునిచ్చారు. జగన్ సరదగా రప్పా రప్పా అన్నారని, మీరు దాన్ని పట్టుకుని రోజూ మాట్లాడితే జనంలో చులకనై పోతామన్నారు. లోకేష్ చెప్పే రెడ్ బుక్ రేపు వారికే ఉరితాడు కాక తప్పదన్నారు.