మహిళా సంఘాలకు రూ. 344 కోట్లు రిలీజ్
NEWS Jul 11,2025 09:36 pm
తెలంగాణ సర్కార్ మహిళా సంఘాలకు రూ. 344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్ల నిధులు కేటాయించింది. ఈనెల 12 నుంచి 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో దశల వారీగా జమ చేస్తుంది. సంఘాలకు చెక్కులను ఆయా నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. వీటితో పాటు ప్రమాద, లోన్ భీమా చెక్కులను సైతం పంపిణీ చేస్తారు.