70 వాహనాలను సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీస్ లు
NEWS Jul 12,2025 09:24 am
జగిత్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారని టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ తెలిపారు. నెంబర్ ప్లేట్ బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేసి వారికి చలాన్లు విధిస్తూ వాహనదారులకు నెంబర్ ప్లేట్ కచ్చితంగా అమర్చు కోవాలని కౌన్సిలింగ్ నిర్వహించారు.