హిందీ భాష మనకు పెద్దమ్మ లాంటిది
NEWS Jul 11,2025 04:46 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మాతృ భాష తెలుగు తల్లి లాంటిదైదే హిందీ భాష మనందరికీ పెద్దమ్మ లాంటిదన్నారు. ప్రతి ఒక్కరు హిందీని తమ భాషగా భావించాలని పిలుపునిచ్చారు. మరో వైపు తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడి సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందీ భాష ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తి లేదని హెచ్చరించింది. ఇదే విషయాన్ని టీవీకే చీఫ్, అగ్ర నటుడు విజయ్ తళపతి కూడా మోదీ, షాలకు వార్నింగ్ ఇచ్చాడు.