నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఇదే: అనిత
NEWS Jul 11,2025 04:25 pm
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సామాజిక మాధ్యమాల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ తల్లిదండ్రులు సమానంగా చూడాలని అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.