బీసీ రిజర్వేషన్లపై మంత్రి చెప్పారు కానీ, కొన్ని అనుమానాలు ఉన్నాయి: కవిత
NEWS Jul 11,2025 04:13 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం సంతోషకరమని, అయితే తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అందుకే ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.