నాలాను మోడల్ గా తీర్చిదిద్దుతాం - హైడ్రా
NEWS Jul 11,2025 04:51 am
హైదరాబాద్ లోని మాసంచెరువు - దిలావర్ఖాన్ - పెద్ద అంబర్ పేట చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. మొత్తం 7.50 కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ నాలా పొడుగున చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, తదితర శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.