నాలో ఉంది నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రక్తం
NEWS Jul 11,2025 07:15 am
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి భయం అంటే ఏమిటో తెలియదన్నారు. తాము ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తన చేతికి కొంత గాయం కావడం వల్ల ఆస్పత్రికి వెళితే తనకు భయపడి పారి పోయానంటూ ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. తన ఇంటి మీద దాడి చేసిన వాళ్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సిద్దంగా ఉందన్నారు. తనలో ఉంది తన తండ్రి శ్రీనివాస్ రెడ్డి రక్తం ఉందని, ఎవరొస్తారో రావాలని మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు.