ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
NEWS Jul 10,2025 04:33 pm
గురు పౌర్ణమిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు..అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.