హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్
NEWS Jul 09,2025 09:13 pm
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో తనను అదుపులోకి తీసుకుంది సీఐడీ. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏపై కేసు నమోదు చేసింది. ఐపీఎల్ ప్రాంచైజీ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టిక్కెట్ల కోసం బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టింది విజిలెన్స్ శాఖ. ఈ మేరకు నివేదిక అందించింది. దాని ఆధారంగా దూకుడు పెంచింది.