హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి
NEWS Jul 09,2025 02:59 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.