జూరాలకు పోటెత్తిన వరద..14 గేట్లు ఎత్తివేత
NEWS Jul 09,2025 07:12 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి వేసి కిందకు నీటిని విడుదల చేశారు. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1.26 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 317.660 మీటర్ల వద్ద నీరు నిలిచి ఉంది.