హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయండి
NEWS Jul 08,2025 07:51 pm
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్ లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోపై నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికీ తిరిగే టీడీపీ నాయకుల్ని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో నిలదీయాలన్నారు.