అప్పన్న గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు
NEWS Jul 08,2025 11:52 am
సింహాచలం గిరిప్రదక్షిణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఆలయాన్ని సందర్శించిన ఆమె.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చి భక్తులకు అవసరమైన సమాచారం అందించాలని, ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బారికేడ్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాల్లో సమస్యలు లేకుండా చూడాలన్నారు.