బతుకమ్మ కుంటను కాపాడాం - రంగనాథ్
NEWS Jul 08,2025 06:07 am
హైదరాబాద్ అంబర్‌పేటలో కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను కాపాడామన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. గత కొన్నేళ్లుగా ఎంతో విలువైన ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇన్నాళ్లు పేరు మాత్రమే వినిపించిన బతుకమ్మ కుంటను కబ్జాదారుల నుంచి రక్షించామన్నారు. ఇక్క చెరువు ఎక్కడ ఉందంటూ ఎద్దేవా చేసిన వాళ్లకు, ఇదిగో చెరువు ఉందంటూ చూపించామని పేర్కొన్నారు. ఆనవాళ్లు కోల్పోతున్న బతుకమ్మ కుంట ఇప్పుడు కళకళ లాడుతోందన్నారు.