ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
NEWS Jul 08,2025 11:20 am
ప్రకాశం జిల్లా కొండేపిలో దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. కొండేపి వైసీపీ మండల అధ్యక్షులు బచ్చల కోటుతో పాటు స్థానిక వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.