ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. మణికొండలోని తన నివాసంలో మృతి చెందారు. తను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు స్వయానా సోదరుడు. తను కూడా సినీ రచయితగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.