నా సవాల్‌ను స్వీకరించే దమ్ముందా.?
NEWS Jul 08,2025 03:13 am
మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు . తాను లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు రావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మీరు డేట్, సమయం ఇచ్చినా సరే లేకపోతే తాము చెప్పిన చోటుకు వచ్చినా సరే తమకు అభ్యంతరం లేదంటూ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ నోరు పారేసుకుంటే మంచిగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. నీకు సీఎంను విమర్శించే అర్హత లేదంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను బుక్ చేశామని తెలిపారు కేటీఆర్.