బెయిల్ అనేది రూల్..జైలు మినహాయింపు
NEWS Jul 08,2025 01:12 am
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో తరచూ చర్చనీయాంశంగా మారుతోన్న బెయిల్ అంశానికి సంబంధించి తీవ్రంగా స్పందించారు. బెయిల్ అనేది చట్టంలో నియమం అని, జైలు అనేది మినహాయింపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడంపై చోటు చేసుకున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇచ్చారు. గత ఏడాది ప్రబీర్, మనీష్ సిసోడియా, కవిత వర్సెస్ ఈడీ కేసులలో చట్ట పరమైన సూత్రాన్ని పునరుద్ఘాటించే ఛాన్స్ లభించిందన్నారు.