సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కపిల్ దేవ్
NEWS Jul 07,2025 01:58 pm
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరి మధ్య హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే కపిల్ దేవ్ ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిశారు. క్రికెట్ అకాడమీ లేదా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.