వివాదాలున్న శాఖలు ఇస్తే ఎలా..?
NEWS Jul 07,2025 12:57 pm
పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాలు ఉన్నవి, ఎలాంటి ఉపయోగం లేని శాఖలు కేటాయించారంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు న్యాయం చేయాలంటూ కోరారు. మంత్రి పొన్నం పక్కనే ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.