బీఆర్ఎస్‌లోకి వెళ్లనందుకే టార్గెట్ చేశారు
NEWS Jul 07,2025 10:40 am
మంత్రి సీతక్క బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు మొదట్నుంచీ తను అంటే పడదన్నారు. వాళ్లు పార్టీలోకి రమ్మని పిలిచారని, కానీ తాను వెళ్ల లేదన్నారు. తనను ఓడిస్తానంటూ కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించడం పట్ల మండిపడ్డారు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా తనను ఓడించ లేక పోయాడన్నారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, కానీ తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనని మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు.