మహిళా సంఘాల సభ్యులకు గుడ్‌న్యూస్
NEWS Jul 07,2025 10:48 am
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు ఇన్సూరెన్స్ కాల పరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే 2029వ సంవత్సరం దాకా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా సభ్యురాలు లేదా తమ కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే స్త్రీనిధి ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందచేస్తోంది. ఇప్పటి వరకు బీమా ద్వారా 409 మంది మహిళా కుటుంబాలకు లబ్ది చేకూరింది.