వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత
NEWS Jul 07,2025 03:36 pm
ఇటీవలే బెయిల్ పై విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో తనను హుటా హుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబీకులు. ప్రస్తుతానికి ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని పేర్కొన్నారు ఆస్పత్రి వైద్యులు. తనను పరామర్శించారు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.